ఆకేరు న్యూస్, హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. దీంతో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరారు. తొలి విడుతలో 21 రాష్ట్రాలు, 102 లోక్సభ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ దశలోనే అత్యధిక స్థానాల్లో పోలింగ్ జరుగుతున్నది.
పోలింగ్ జరుగుతున్నా రాష్ట్రాలు ఇవే..!
మొదటి విడతలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్ఛిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులతో సహా కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరి లలో ఎన్నికలు జరుగతున్నాయి.అరుణాచల్, సిక్కిం రాష్ర్టాల అసెంబ్లీలకు కూడా నేడు ఎన్నికలు జరగుతున్నాయి.
1625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 1491 మంది పురుషులు ఉండగా, 134 మంది మహిళా అభ్యర్థులు. ఇందులో మొత్తం 16 కోట్ల 63 లక్షలమంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
సుమారు లక్షా 87 వేల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 18 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు.
ఏ రాష్ట్రంలో ఎన్ని స్థానాలు అంటే..
తమిళనాడు-39, రాజస్థాన్-12, ఉత్తర్ప్రదేశ్-8, మధ్యప్రదేశ్-6, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరాఖండ్-5 చొప్పున, బీహార్-4, పశ్చిమ బెంగాల్-3, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్, మేఘాలయలో- 2 చొప్పున, ఛత్తీస్గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్ముకశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో 1 స్థానం చొప్పున ఉన్నాయి.
—————————–