ఆకేరు న్యూస్, మెదక్: మంత్రి కొండా సురేఖ పసి పిల్లలపై తనుకున్న మమకారాన్ని, ఆప్యాయతానురాగాలను మరోసారి చాటుకున్నారు. మెదక్ జిల్లా అభివృద్ధిపై కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు అక్కడికి వచ్చిన మంత్రి సురేఖ బయట ఓ సీనియర్ మహిళా కానిస్టేబుల్ చేతిలో పసిబిడ్డను చూసి, కాన్వయ్ ఆపి ఆమె దగ్గరకు వెళ్ళారు. ఎండగా వుండటంతో ఆ బాలుడికి మంచినీళ్ళు తాగించి, పసిబిడ్డ తల్లి వివరాలను ఆరా తీశారు. బాబు తల్లి కూడా తనతో పాటు విధులను నిర్వహిస్తున్నారని ఆమె చెప్పటంతో మంత్రి సురేఖ బాబు తల్లి, కానిస్టేబుల్ శ్రీలతను పిలిచి మాట్లాడారు. వారిద్దరినీ తనతో పాటు కాన్వాయ్‌లో కలెక్టరేట్ కార్యాలయంలోకి తీసుకుని వెళ్ళారు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ మహిళా కానిస్టేబుల్ పరిస్థితిని వివరించి మరోచోట డ్యూటీ వేయాలని ఆదేశించారు.
………………………………………