
* రాష్ట్రానికి రూ.15 వేల కోట్ల నష్టం
* బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అసమర్థత, అహంభావం వల్లే తెలంగాణకు కష్టాలు తప్పడం లేదని, రూ.15 వేల కోట్ల నష్టం వాటిల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. తన రియల్ ఎస్టేట్ అవసరాల కోసం, ఉనికిలో లేని ఫోర్త్ సిటీ వైపు మళ్లించే నెపంతో, ఏకపక్షంగా ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ను రద్దు చేశారని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాలు, కమీషన్ల కోసం ఎల్ అండ్ టీ ప్రతిష్టను దిగజార్చి, సంస్థను నాశనం చేయడానికి ప్రయత్నించారని మండిపడ్డారు. అందుకే ఆ సంస్థ రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నదని చెప్పారు. ‘రేవంత్ రెడ్డి చేతకానితనం, మితిమీరిన అహంభావం వల్ల రాష్ట్ర అభివృద్ధి గాడి తప్పింది. మెట్రో రైలును ఎల్ అండ్ టీ సంస్థ నుంచి తీసుకుంటామన్న ప్రభుత్వ నిర్ణయంతో పౌరులపై రూ.15 వేల కోట్ల భారం పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతకానితనం, అనవసరపు అహంభావం వల్ల తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. తన రియల్ ఎస్టేట్ అవసరాల కోసం, ఉనికిలో లేని ఫోర్త్ సిటీ (FOURTH CITY) వైపు మళ్లించే నెపంతో, ఏకపక్షంగా ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ను రద్దు చేశారు. మేడిగడ్డ వద్ద అక్రమ కేసులు పెడతామని ఎల్ అండ్ టీ వంటి భారీ కార్పొరేట్ సంస్థను బెదిరించారు. ఇది కేవలం తన రాజకీయ ప్రయోజనాలు, కమీషన్ల కోసమే. ఓ జాతీయ చానల్లోనే స్వయంగా ఎల్ టీ (L&T) కంపెనీ సీఎఫ్ఓను జైల్లో పెట్టాల్సిందిగా పోలీసులను కోరానని గొప్పలు చెప్పుకున్నారు. ఎల్ అండ్ టీ ప్రతిష్టను దిగజార్చి, సంస్థను నాశనం చేయడానికి ప్రయత్నించారు. అయితే, తెలంగాణ ప్రజల్లాగా చేతకాని ముఖ్యమంత్రిని భరించాల్సిన అవసరం ఈ కంపెనీలకి లేకపోయింది. అందుకే వారు రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లిపోతున్నారు. సీఎం మితిమీరిన అహంభావం, గూండాగిరి కారణంగా రాష్ట్ర పన్ను చెల్లింపుదారులపై రూ.15 వేల కోట్ల అప్పు భారం పడనుంది. ’ అంటూ ట్వీట్ చేశారు.
……………………………………