
* ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ
ఆకేరున్యూస్, హైదరాబాద్: నిండు అసెంబ్లీలో కేసీఆర్ ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని అణగ తొక్కుతా అని అవమానిస్తే, 40 నిమిషాల ప్రసంగంలో రేవంత్ రెడ్డి ఎమ్మార్పీఎస్ పేరు తీయకుండా అవమానించారన్నారని, ఎన్నో ఏళ్లుగా సమాజానికి దూరంగా ఉన్న తనను నరేంద్రమోదీ గుర్తించి గుండెలకు హత్తుకుని హృదయంలో పెట్టుకున్నారన్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తన 30 ఏళ్ల పోరాటంలో జాతి కోసం కొన్ని రోజులు కష్టపడితే సమాజంలో జరిగే అనేక కష్టనష్టాలపై పోరాటం చేసిన చరిత్ర ఎమ్మార్పీఎస్‌కు ఉందని మందకృష్ణ మాదిగ అన్నారు. సమాజంలో అట్టడుగు వర్గం నుంచి వచ్చిన తమ ఉద్యమాన్ని గుర్తించి గుండెలకు హత్తుకున్న నరేంద్ర మోదీని, ఉద్యమానికి అడుగడుగున బాసటగా నిలిచిన సమాజానికి తాను రుణపడి ఉంటానన్నారు.
……………………………….