![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/images-12.jpg)
* ఈ ఒక్కరోజే 2 కోట్ల మంది పుణ్యస్నానాలు
* హెలికాప్టర్ల ద్వారా భక్తులపై పూల వర్షం
ఆకేరు న్యూస్, డెస్క్ : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు (Maha Kumbh Mela) మాఘ పౌర్ణమి సందర్భంగా ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో ఘాట్లన్నీ నిండిపోయాయి. మాఘ పౌర్ణమి.. సందర్భంగా ఈ ఒక్కరోజే మధ్యాహ్నం 3 గంటల వరకు 2 కోట్ల మందికిపైగా జనం పుణ్యస్నానాలు ఆచరించినట్లు, ఉత్తరప్రదేశ్ అధికారులు వెల్లడించారు. ఈ రోజు రాత్రి 7:22 వరకూ మాఘ పౌర్ణమి స్నానాలు కొనసాగనున్నాయి. దాదాపు 3 కోట్ల మంది ఇవాళ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కుంభమేళా ప్రాంతంలో దాదాపు 15 కిలోమీటర్ల మేర రద్దీ నెలకొంది. భక్తులపై యూపీ సర్కార్ (Up Government) హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. 25 క్వింటాళ్ల పూలను భక్తులపై వెదజల్లారు. మరోవైపు భక్తుల రద్దీ దృష్ట్యా యూపీ సర్కార్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. గత నెల మౌనీ అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఇవాళ మహాకుంభమేళాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
………………………………..