*భారతదేశంలోనే మొదటి సంగీత రహదారి
* స్థిరమైన వేగాన్ని ప్రోత్సహించి, రోడ్ సేఫ్టీని మెరుగుపరచడమే లక్ష్యం – మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
ఆకేరు న్యూస్, కమలాపూర్: ముంబై కోస్టల్ రోడ్‌పై దేశంలోనే తొలి మ్యూజికల్ రోడ్ బుధవారం అందుబాటులోకి వచ్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ మ్యూజికల్ రోడ్‌ను ప్రారంభించారు. ఈ ప్రత్యేక రోడ్ స్ట్రెచ్‌పై వాహనాలు నడిపితే స్లమ్ డాగ్ మిలియనీర్ లోని పాట జై హో మ్యూజిక్ వినిపిస్తుంది. హంగేరియన్ టెక్నాలజీ సహాయంతో ఖచ్చితమైన ఇంటర్వల్స్‌లో ప్రత్యేక రంబుల్ స్ట్రిప్స్ తో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టును బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ రూ.6.21 కోట్ల తో పూర్తి చేసింది. కాగా ఇది ప్రపంచంలోనే ఐదవ మ్యూజికల్ రోడ్‌గా నిలిచింది.
*ఎలా పనిచేస్తుంది?*
వాహనాలు 70-80 కి.మీ/గం వేగంతో వెళ్తే టైర్లు రోడ్డుపై రుద్దుకునే ఘర్షణ వల్ల ‘జై హో’ పాట సౌండ్ కారు లోపల, బయట, కిటికీలు మూసినా వినబడుతుంది. ముంబైలోని నారిమన్ పాయింట్ నుంచి వర్లి వైపు ఉత్తరంగా ఉన్న రోడ్లో, అండర్‌గ్రౌండ్ టన్నెల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 500 మీటర్ల స్ట్రెచ్‌లో ప్రత్యేక రంబుల్ స్ట్రిప్స్ (గ్రూవ్స్)ను ఏర్పాటు చేశారు. టన్నెల్ లోపల 500 మీటర్లు, 100 మీటర్లు, 60 మీటర్ల దూరంలో అడ్వాన్స్ సైన్‌బోర్డులు ఏర్పాటు చేసి డ్రైవర్లకు ముందస్తు హెచ్చరిక ఇస్తున్నారు. ఈ ప్రయత్నం కారు ప్రయాణికులకు ఇది కొత్త అనుభవం.
