*ప్రశాంతం గా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు
ఆకేరు న్యూస్,ములుగు:
మొదటిసారి ములుగు జిల్లాలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ మున్సిపాలిటీలో 13963 మంది ఓటర్లకు గాను 11227 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 80.41శాతం ఓటింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ములుగు జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ములుగు పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి కేంద్రాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేసి, ఓటర్లు భయభ్రాంతులకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు. ఓటింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను
స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణంలో ముఖ్య ప్రాంతాల్లో సాయుధ గార్డులు, రూఫ్‌టాప్ ఆర్మ్డ్ పార్టీలు నియమించి 24 గంటల ఓట్ల లెక్కింపు వరకు పహారా ఏర్పాటు చేశారు.
దీంతో ములుగు మున్సిపల్ ఎన్నికలు విజయవంతంగా, శాంతియుత వాతావరణంలో ముగిశాయి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
