ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటి వరకు పీసీసీ ప్రెసిడెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. కొన్ని రోజులుగా పీసీసీ ప్రెసిడెంట్ నియామకం కోసం కసరత్తు చేసిన కాంగ్రెస్ అధిష్టానం చివరకు బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ తన ఎంపికకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
——————————–