
* పార్టీ పెద్దలతో భేటీ
* స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించే అవకాశం
*అధిష్టానం దృష్టికి నామినేటెడ్ పోస్టుల భర్తీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ ్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మహేష్ కుమార్ ఢిల్లీ పర్యటన కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జు ఖర్గే జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలపడానికి మహేష్ కుమార్ వెళ్లారని చెప్తున్నా ఢిల్లీ పెద్దలతో పలు అంశాలపై మహేష్ కుమార్ గౌడ్ చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా పార్టీ అధిష్టానంతో చర్చించన్నట్లు సమాచారం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం ప్రధానంగా చర్చకు రావచ్చని భావిస్తున్నారు.ఇప్పటికే స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సును తీసుకువచ్చింది. గవర్నర్ వద్ద ఈ ఆర్డినెన్సు పెండింగ్ లో ఉంది . ఒక వేళ ఆర్డినెన్సు విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుంటే స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కేటాయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది అలాగే రాష్ట్రంలో చాలా కాలంగా నామినేటెడ్ పోస్టులుయ పెండింగ్ లో ఉన్నాయి. నామినేషన్ పోస్టులను ఎవరికి కేటాయించాలి ఎప్పుడు కేటాయించాలనే విషయాన్ని పీసీసీ చీఫ్ పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల లోపే నామినేటెడ్ పోస్టుల భర్తీ జరుగుతుందని అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ పదవుల కోసం పలువురు ఆశావహులు ఎదురుచూస్తున్నారు.
………………………………………………………