
* 8మంది మృతి..43మందికి గాయాలు
ఆకేరున్యూస్,డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ లోని కాప్గండ్ నుంచి రాజస్థాన్ లోని గోగామేడికి 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రాక్టర్ ను ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా 43 మందికి గాయాలయ్యాయి. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయ పడ్డ వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
…………………………………………………