
* మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ 2025 విన్నర్ గా విధు ఇషికా
* నేనే చేయలేనని అనుకునే ప్రతీ మహిళ విజయం : ఇషికా
ఆకేరున్యూస్, డెస్క్ : మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ 2025 (Mrs. Earth International 2025) కిరీటాన్ని భారత దేశం గెలుచుకుంది. టెలివిజన్ షోలలో హోస్ట్ గా పనిచేసిన విధు ఇషికా (Vidhu Ishika)ఈ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. దేశం గర్వపడేలా అంతర్జాతీయ వేదికపై సత్తా చాటారు. ఈ ప్రతిష్టాత్మక అందాల పోటీలో ఆమె విజయం సాధించారు. ఆమె కేవలం అందాల పోటీల్లోనే విజయం సాధించినట్లు కాదని, సామాజిక అడ్డంకులను, సనాతన ఆలోచనలను బద్దలు కొట్టడానికి ఒక ఉదాహరణగా నిలిచారని పలువురు కొనియాడుతున్నారు. ఆమె కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. టైటిల్ గెలుచుకున్న తర్వాత, విధు ఇషిక సోషల్ మీడియాలో భావోద్వేగంతో ఒక పోస్ట్ పెట్టారు. ఇది తన విజయం మాత్రమే కాదని, తాను చేయలేనని అనుకునే ప్రతీ మహిళ విజయం అని చెప్పారు. ఈ విజయం భారతీయ వారసత్వం, సంగీతం, స్త్రీత్వానికి గుర్తింపు అన్నారు. స్నేహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు ఇన్స్టాగ్రామ్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. “మీ ప్రేమ, మద్దతు నన్ను ఇంత దూరం తీసుకువచ్చాయి. మీరు లేకుండా ఈ ప్రయాణం అసంపూర్ణంగా ఉండేది. విధు ఇషిక సాధించిన విజయం కేవలం వ్యక్తిగత విజయం, కానీ మహిళా సాధికారత వైపు భారతదేశం తీసుకున్న మరో చారిత్రాత్మక అడుగు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన భారతీయ మహిళకు దక్కిన గౌరవం” అన్నారు.
………………………………………