* మాజీ మంత్రి హరీష్ రావు
* ప్రాజెక్ట్‌ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
ఆకేరు న్యూస్, సిద్దిపేట్: కేసీఆర్ కట్టించిన మల్లన్న సాగర్ 21 టీఎంసీల నీటితో ఒక సముద్రంలాగా కనిపిస్తుందని.. ఈ దృశ్యాన్ని చూసి కడుపు నిండినంత సంతోషం కలిగిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మల్లన్న సాగర్‌కు రికార్డు స్థాయిలో 21 టీఎంసీల నీరు విడుదలైన సందర్భంగా ప్రాజెక్ట్ ని సందర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
…………………………..