ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక చొరవతో పది సంవత్సరాలుగా పెండిరగ్లో ఉన్న ఆరోగ్య మిత్రల ప్రధాన డిమాండైనా క్యాడర్ మార్పు (డేటా ఆపరేటర్)ను అంగీకరిస్తూ వేతనాన్ని 15,600 నుండి 19,500కు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ తీసుకున్న చొరవతో సమ్మె విరమిస్తూ ఆరోగ్య మిత్రలు లేఖ విడుదల చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆరోగ్యం మిత్రలు స్వాగతించి యధావిధిగా ఆరోగ్యశ్రీ సేవల విధులలో పాల్గొంటున్నట్టుగా ప్రకటించారు. అలాగే తమ డిమాండ్ల పరిష్కారానికి కృషిచేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఆరోగ్య మిత్రలు కృతజ్ఞతలు తెలిపారు.
…………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
