![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/11-02-2025_HCM_MANDA-KRISHNA-MET-6-1024x618.jpg)
* ఎస్సీ వర్గీకరణ నివేధికలో లోపాలున్నట్లు వెల్లడి
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం సీఎం రేవంత్‌తో ఆయన భేటీ అయ్యారు. వర్గీకరణ పట్ల చిత్తశుద్దితో వ్యవహరించారని కృతజ్ఞతలు తెలిపారు. కాగా, దానిలో కొన్ని లోపాలున్నాయంటూ ఆయన సీఎం దృష్టికి తీసుకుని వెళ్లారు. అనంతరం మందకృష్ణ మాదిగ విలేకరులతో మాట్లాడుతూ జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికపై ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. ‘సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేశారు. ఇందులో రేవంత్‌రెడ్డి భాగస్వామ్యం అయ్యారు. అందుకే వారికి ధన్యవాదాలు తెలిపామన్నారు. అయితే, జస్టిస్ షవిూమ్ అక్తర్ నివేదికలో కొన్ని లోపాలున్నాయి. ఎస్సీలను 1,2,3 గ్రూపులుగా కాకుండా ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించాలి. నివేదికలో ఉన్న లోటుపాట్లను సరిచేస్తారని ఆశిస్తున్నామని మందకృష్ణ అన్నారు.
……………………………………….