ఆకేరు న్యూస్, ములుగు: మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరైన కొయ్యడ సాంబయ్య అలియాస్ గోపన్న అలియాస్ ఆజాద్ ఆలియాస్ అశోక్ లింగిపోయినట్లు తెలుస్తోంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన కొయ్యడ సమ్మయ్య లక్ష్మీ దంపతుల సంతానం ఆరుగురు. వీరిలో నలుగురు అన్నదమ్ములు ఇద్దరు అక్కచెల్లెళ్లు సాంబయ్య రెండవ కుమారుడు చిన్నతనం నుంచే చురుకైన వ్యక్తిగా ఉండేవాడు. గతంలో పీపుల్స్ వార్ ఉద్యమ పోరాటానికి ఆకర్షితులై 20 సంవత్సరాల వయసులో 1993 సంవత్సరంలో అప్పటి దళ కమాండర్ మధు, కేకే డబ్ల్యూ (ఖమ్మం కరీంనగర్ వరంగల్) కార్యదర్శి గణేష్ ఆధ్వర్యంలో పోరుబాట పట్టి ఉద్యమంలోకి దళ సభ్యులుగా వెళ్ళాడు. సాంబయ్య తోపాటు మరో 14 మంది మొద్దులగూడెం గ్రామం నుంచి వెళ్లారు .చివరకు సాంబయ్య అలియాస్ ఆజాద్ ఒక్కరే ప్రస్తుతం భద్రాద్రి ఆలూరు డివిజన్ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది .ఇతనిపై 20 లక్షల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వివిధ సంఘాల నాయకులు సాంబయ్య కు ఎలాంటి హాని తలపెట్టకుండా కోర్టు లో హాజరు పరచాలని పౌరహక్కుల సంఘం నాయకులు కోరుతున్నారు.
…………………………………………….
