ఆకేరున్యూస్, హైదరాబాద్: గరియాబాద్ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలకనేత ప్రమోద్ అలియాస్ చంద్రహాస్ చనిపోయినట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి. చంద్రహాస్ ఒడిశాతో పాటు ఈస్ట్ జోనల్ బ్యూరో ఇన్చార్జ్గా పనిచేస్తున్నారని అధికారులు వెల్లడిరచారు. ఆయనపై రూ.20 లక్షలకుపైగా రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో 16 మంది మావోయిస్టులు చనిపోగా.. వారితో పాటు భద్రతా దళాలకు దొరక్కుండా తిరుగుతున్న మావోయిస్టు అగ్రనేత జయరాం రెడ్డి అలియాస్ చలపతి కూడా ఉన్నారు. తాజాగా చంద్రహాస్‌ను హతమార్చినట్లు పోలీసులు వెల్లడిరచారు. చంద్రహాస్ అలియాస్ పాండన్న అలియాస్ ప్రమోద్ హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన వారు. 1985లో గద్దర్ టీమ్‌లో కొంతకాలం పనిచేసిన చంద్రహాస్.. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన మావోయిస్టు పార్టీ డీకేఎస్ జేడీసీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
……………………………………………..