
* కాసేపట్లో మావోయిస్టు నేత కట్టా రాంచంద్రా రెడ్డి అంత్యక్రియలు
* తీగలకుంటపల్లిలో విషాదం
ఆకేరు న్యూస్ హనుమకొండ : చత్తీస్ ఘడ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలోని అబూజ్ మడ్ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందినమావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు కట్టా రాంచంద్రా రెడ్డి మృతదేహాన్ని ఆయన స్వగ్రామం సిద్దిపేట సిద్దిపేట కోహెడ మండలం తీగలకుంటపల్లి కి తరలించారు. మరి కాసేపట్లో కట్టా అంత్యక్రియలు నిర్వహించనున్నారు.మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నక్సలైట్ల ఉద్యమంలో కట్టా చురుకుగా పాల్గొన్నారు. కేంద్ర కమిటీ సభ్యులుగా పని చేస్తూ ఎన్కౌంటర్లో మరణించారు. దాదాపు నెల రోజుల క్రితం ఎన్కౌంటర్లో మృతిచెందగా.. ఆయన మరణంపై అనుమానాలతో రీపోస్ట్ మార్టం చేయాలంటూ కట్టా రాంచంద్రా రెడ్డి కుటుంబసభ్యులు చత్తీస్‌గఢ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు తీర్పు ఆలస్యం కావడంతో బాధిత కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రీపోస్ట్ మార్టం అప్పీల్‌ను హైకోర్టు తిరస్కరించడంతో నెల రోజుల తర్వాత స్వగ్రామానికి రామచంద్రారెడ్డి మృతదేహం వచ్చింది. నేడు తీగలకుంటపల్లిలో రామచంద్రారెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి. మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లకు ముందు కట్టా రాంచంద్రారెడ్డి ప్రైవేట్ టీచర్ గా తన జీవితాన్ని ప్రారంభించి తరువాత ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. వరికోల్ గ్రామంలో ని ప్రభుత్వ పాఠశాలలో కట్టా రాంచంద్రా రెడ్డి ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అప్పుడు మావోయిస్ట్ సిద్ధాంతాలకు ఆకర్శితుడై 1989లో అజ్ఞాతంలోకి వెళ్లారు.
……………………………………………..