
* కందగట్ల యాదగిరి అలియాస్ భాస్కర్ , రాజ్మన్ భట్టుపల్లి వాసే
ఆకేరు న్యూస్, వరంగల్ : సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేత కందగట్ల యాదగిరి అలియాస్ రాజ్మన్, అలియాస్ భాస్కర్ చత్తీష్గడ్లో సీఎం విష్ణుదేవ్ సాయి ముందు లొంగిపోయారు. ఆయనతో పాటు దాదాపు యాభై మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. కందగట్ల యాదగిరి హనుమకొండ జిల్లా భట్టుపల్లికి చెందినవాడు. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటి సభ్యుడి హోదాలో కొనసాగుతున్నారు. యాదగిరి మూడు దశాబ్దాలుగా మావోయిస్ట్ పార్టీలో కొనసాగుతున్నారు.
——————————–