* 15 మంది మావోయిస్ట్‌ల మృతి
* మృతుల్లో మావోయిస్ట్ అగ్రనేత
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : మరో సారి మావోస్ట్లకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. గురు వారం జార్ఱండ్‌లో ని సింగ్భూమ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లో పదిహేను మంది మావోయిస్ట్‌లు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత పతిరామ్ మాంఝీ ఉన్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా కీలక నేతలను కోల్పోతున్న మావోయిస్ట్ పార్టీకి మాంఝీని కోల్పోవడం కోలుకోలేని దెబ్బ అని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే చత్తీష్ ఘడ్, ఒరిస్సా రాష్ట్రాల్లో మావోయిస్ట్ లు భారీ సంఖ్యలో మృతి చెందారు. జార్ఖండ్ ఎన్ కౌంటర్‌తో మరో సారి తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది.
————————————-
