— ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు..
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా,తాడ్వాయి మండలం,మేడారం గ్రామానికి చెందిన మండపు మల్లేశం,సారక్క దంపతుల కుమారుడు లక్ష్మి రాజు. నిరుపేద ఆదివాసి కుటుంబానికి చెందినవారు. తల్లిదండ్రులు కూలీనాలీ చేసి లక్ష్మీరాజును పదో తరగతి వరకు హనుమకొండ ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్మీడియట్ సిఓఈ రాజేంద్రనగర్ ప్రభుత్వ కాలేజీలో చదివించారు. లక్ష్మీ రాజ్ 2025 నీట్ ఎగ్జామ్ 420 మార్కులు సాధించాడు. శుక్రవారం విడుదలైన ఫలితాలలో సింగరేణి సిమ్స్ ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీలో లక్ష్మీరాజుకు సీటు వచ్చింది. ఎంబీబీఎస్ చదవడానికి కాలేజీ ఫీజు, ట్యూషన్ ఫీజు తదితర ఖర్చులకోసం లక్షా 50 వేల రూపాయలు ఖర్చు అవుతాయని తెలిపారు. లక్ష్మీరాజు కుటుంబ సభ్యులు రెక్కడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం తల్లిదండ్రులు కూలీ నాలీ చేసి కొడుకును ప్రభుత్వ పాఠశాలల్లో చదివించారు. ఇప్పుడు ఎంబిబిఎస్ చదవడానికి కాలేజీ ఫీజులు కట్టడానికి చేతిలో చిల్లీ గవ్వలేదు.ఎవరైనా ముందుకు వచ్చి లక్ష్మీరాజు చదువు కోసం ఆర్థిక సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
………………………………………………….
