ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తుంబి ఎయిర్ లైన్స్ ఈ సేవలను అందిస్తున్నారు. గురువారం మంత్రి సీతక్క జెండా ఊపి హెలికాప్టర్ రైడ్ సర్వీసు సేవలను ప్రారంబించారు.
మొదటగా జాయ్ రైడింగ్ లో ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీ) సంపత్ రావు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ , కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పల్లె జైపాల్ రెడ్డి,ములుగు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతనిప్పుల బిక్షపతి లు జాయ్ రైడింగ్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గత చరిత్రలో చూసుకుంటే దూరప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఎడ్ల బండ్ల మీద వచ్చే వారని తరాలు మారుతున్నాయని, టెక్నాలజీ తో రవాణా సౌకర్యాలు పెరిగాయని బస్సులు,కారులు వస్తున్నాయని, ప్రస్తుతం ములుగు ప్రాంత ప్రజలకు దూర ప్రాంత భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పర్యాటక శాఖ ద్వారా హెలికాప్టర్ లో జాతరకు చేరే విధంగా సర్వీసు ప్రారంభిస్తున్నామని భక్తులు ఈ సర్వీసులు ఉపయోగించుకోవాలని మంత్రి సీతక్క కోరారు.
ఈ కార్యక్రమంలో ములుగు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ సంపత్ రావు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్,మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్,ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పల్లె జైపాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతనిప్పుల బిక్షపతి,జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు జక్కుల రేవంత్ యాదవ్,ములుగు మాజీ ఎంపీటీసీ మావురపు తిరుపతి రెడ్డి, బీసీ సెల్ అధికార ప్రతినిధి గండ్రత్ జయాకర్ జిల్లా నాయకులు సీనియర్ నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………..
