ఆకేరున్యూస్, మేడారం: తెలంగాణ మంత్రివర్గం తొలిసారి హైదరాబాద్ వెలుపల సమవేశం కాబోతున్నది. ఈ రోజు మేడారంలో తెలంగాణ క్యాబినెట్ భేటీ కానున్నది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో.. మున్సిపల్ ఎన్నికలు, గోదావరి పుష్కరాల నిర్వహణపై చర్చ జరగనున్నట్లు సమాచారం.. పునర్నిర్మించిన మేడారం ఆలయాన్ని ఈ రోజు సీఎం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అక్కడే మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా.. ఆలయ ప్రారంభానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వరంగల్ నుంచి వెళ్ళేవారికి ములుగు, పస్రానార్లాపూర్ మీదుగా మాత్రమే మేడారానికి ఎంట్రీ
ఉంటుంది. తాడ్వాయి మీదుగా వెళ్లే వాహనాలకు ఎంట్రీ లేదు. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో కూడా బయ్యక్కపేట, భూపాలపల్లి, పరకాల, గుడెప్పాడ్ మీదుగా వరంగల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
……………………………………………

