Medipally Jewellery
Medipally Jewellery| ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీ జ్యువెలరీ చోరీ చోటుచేసుకుంది. మేడిపల్లిలోని క్యారట్‌లేన్ జ్యువెలరీ షోరూమ్‌లో సోమవారం తెల్లవారుజామున దుండగులు చొరబడి సుమారు రూ.2 కోట్ల విలువైన వజ్రాభరణాలు, ఇతర నగలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
షట్టర్ వంచి చోరీ
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. దుండగులు ముందుగా షోరూమ్ షట్టర్‌ను వంచి లోపలికి ప్రవేశించారు. అనంతరం గ్లాస్ డిస్ప్లేలను ధ్వంసం చేసి అందులోని విలువైన ఆభరణాలను తీసుకెళ్లారు. ఈ మొత్తం వ్యవహారం కేవలం ఐదు నిమిషాల్లోనే పూర్తయినట్లు తెలుస్తోంది.
ఏడుగురు సభ్యుల ముఠా
ఈ ఘటనలో మొత్తం ఏడుగురు పాల్గొన్నట్లు డీసీపీ సురేష్ వెల్లడించినట్లు సమాచారం. వారిలో ఒకరు మాత్రమే షోరూమ్‌లోకి వెళ్లి నగలను దోచుకోగా.. మరో ఆరుగురు బయట ఉండి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. చోరీ జరిగిన తీరు చూస్తే ముందస్తు ప్రణాళికతోనే ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
అలారంపై ఆరా
షోరూమ్ భద్రతా వ్యవస్థపై నిందితులకు ముందుగానే అవగాహన ఉండి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా అలారం పనిచేసే విధానంపై వారికి సమాచారం ఎలా వచ్చింది? గతంలో షోరూమ్‌ను పరిశీలించారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
రాజస్థాన్ ముఠాపై అనుమానం
చోరీ వెనుక రాజస్థాన్‌కు చెందిన ముఠా ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దర్యాప్తు పూర్తయ్యే వరకు దీనిపై అధికారిక నిర్ధారణ లేదని పోలీసులు చెబుతున్నారు. నిందితులు ఉపయోగించిన వాహనాలు, వారి కదలికలు, చోరీ అనంతరం వెళ్లిన మార్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
సీసీటీవీతో దర్యాప్తు
సమాచారం అందుకున్న వెంటనే మేడిపల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్‌తో షోరూమ్‌ను పరిశీలించి వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తూ నిందితుల రాక, షోరూమ్‌లోకి ప్రవేశించిన విధానం, ఉపయోగించిన వాహనాలు, చోరీ అనంతరం వారి కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. సాంకేతిక ఆధారాలతో పాటు సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తూ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
