
* ఎవరికి ఎన్ని పోస్టులో తెలుసా?
* ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఆకేరు న్యూస్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదినం రోజునే వారికి శుభవార్త చెప్పింది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈరోజు ఉదయమే ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ 2025 విడుదల చేశారు. 16,347 టీచర్ పోస్టులకు ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ (AP DSC Notification 2025) విడుదల చేశారు. అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ విద్యాశాఖ వెబ్సైట్ https://apdsc.apcfss.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇదే వెబ్సైట్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.
ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే..
ఈ మెగా డీఎస్సీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనుంది. వీటిలో జిల్లా స్థాయిలో 14,088 పోస్టులు ఉన్నాయి. ఇందులో అన్ని రకాల ఎస్జీటీ పోస్టులు 6,599 ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్లు 7,487, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు కలిపి 14,088 పోస్టులు ఉన్నాయి. ఇక రాష్ట్ర, జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో జోన్-1లో 400, జోన్-2లో 348, జోన్-3లో 570, జోన్-4లో 682 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో మొత్తం 13,192 పోస్టులు, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 881 పోస్టులు, జువెనైల్ పాఠశాలల్లో 15 పోస్టులు, రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసే బధిరులు, అంధుల పాఠశాలల్లో 31 పోస్టులు ఉన్నాయి.
ఏపీ మెగా డీఎస్సీ 2025 షెడ్యూల్ ఇలా
ఆన్లైన్ ఫీజుల చెల్లింపులు, దరఖాస్తుల స్వీకరణ తేదీలు: ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు
మాక్ టెస్ట్‌లు: మే 20 నుంచి
హాల్‌టికెట్ల డౌన్లోడ్ తేదీ: మే 30 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు
ఏపీ డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలు: జూన్ 6 నుంచి జులై 6 వరకు
ప్రాథమిక కీ విడుదల: అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజే ప్రాథమిక కీ విడుదల
అభ్యంతరాల స్వీకరణ: ఆ తర్వాత ఏడు రోజులపాటు అభ్యంతరాల స్వీకరణ
ఫైనల్ కీ: అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుది కీ విడుదల
మెరిట్ జాబితా: ఫైనల్ కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత విడుదల
…………………………………………….