* తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన
* నేటి నుంచి 5 రోజుల పాటు..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ (Meteorological Department) హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి 5 రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు తెలిపింది. నేటి మధ్యాహ్నం 3 తర్వాత పశ్చిమ తెలంగాణ (Telangana), కోస్తా (Coast) లో జల్లులు పడుతాయి. సాయంత్రం 4 తర్వాత వర్షం పెరుగుతుంది. సాయంత్రం 5గంటల తర్వాత ఉత్తర (North), పశ్చిమ తెలంగాణ (West Telangana), హైదరాబాద్ (Hyderabad), కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాత్రి 8 తర్వాత ఉత్తర తెలంగాణ (North Telangana) లో వర్షం పడుతుందని తెలిపింది. అర్థరాత్రి వరకు వర్షం పడుతుందని అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ (IMD) తెలిపింది. అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అరేబియాలో పరిస్థితులు బాగలేనందున కేరళ (Kerala) గజగజా వణికిపోతుంది. అటు నుంచి వచ్చే గాలులు వేగం స్థిరంగా ఉండదని ఐఎండీ పేర్కొంది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదు నీరు వస్తుండటంతో శ్రీశైలం డ్యామ్ (Srisailam Dam) పది గేట్లను ఎత్తివేశారు. ఈ ఇన్ ఫ్లూ ఓ ఐదు రోజులపాటు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో డ్యామ్ చూసేందుకు వెళ్లే పర్యాటకులు..డ్యామ్ వద్ద అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. నల్లమలలో ప్రయాణించే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
————————