
* ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డికి సీఎం హామీ
ఆకేరున్యూస్, జనగామ ః పాలకుర్తిలో మినీ స్టేడియం నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆమె ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వరంగల్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంతో పాటు స్పర్ట్స్ అకాడమీని నెలకొల్పాలని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలందరూ కలసి ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి వినతి చేశారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ నేపధ్యంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి పాలకుర్తిలో మినీ స్టేడియం మంజూరు చేయాలని ప్రత్యేకంగా కోరగా సీఎం సానుకూలత వ్యక్తం చేశారు.త్వరలోనే పాలకుర్తి మినీ స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
………………………………………..