ఆకేరు న్యూస్, ములుగు : మంత్రి ధనసరి అనసూయ సీతక్క (Danasari Anasuya Seethakka) సొంత జిల్లా ములుగు జిల్లా (Mulugu District) లో ఈరోజు పర్యటిస్తున్నారు. ఆది నుంచీ ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి పాటుపడ్డ సీతక్క.. మంత్రిగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ గ్రామా (Agency villages) ల్లో పర్యటిస్తున్నారు. కస్తూర్భా బాలికల ఆశ్రమ పాఠశాలను (Kasturbha Girls Ashram School), కంటైనర్ సబ్ సెంటర్ (Container Sub Center) ప్రారంభించారు. అనంతరం బాలికల ఆశ్రమ పాఠశాలలో తరగతి గదులు, వసతి భవనాన్ని పరిశీలించారు. గిరిజన గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. ఎలెక్షన్ల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కృషి చేస్తామన్నారు. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి.. వాటి పరిష్కరానికి ఏం చర్యటు చేపట్టాలనే దానిపై అధికారులతో చర్చించారు. ప్రభుత్వంతో మాట్లాడి నిధులు విడుదల చేసిన వెంటనే పనులు మొదలుపెడతామన్నారు.
——————————