ఆకేరున్యూస్, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలోని మామునూర్ ఎయిర్‌ఫోర్ట్ స్థలాన్ని గురువారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ, వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కెఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదలతో కలిసి పరిశీలించారు. అనంతరం గుంటూరు పల్లి, గాడిపల్లి, నక్కలపల్లి, రైతులతో సమావేశమై ఎయిర్‌ఫోర్ట్‌కు భూములు అప్పగింతపై రైతులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………….