* అధికారులతో సమీక్షా సమావేశం
* సమావేశంలో పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ బలరాం నాయక్
ఆకేరు న్యూస్, ములుగు : మేడారం సమ్మక్క సారక్క జాతర అభివృద్ధిపనులను అనుకున్న టైంలోనే
అనుకున్న విధంగా అభివృద్ధి పనులుపూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మంత్రులు కొండా సురేఖ,సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ లతో కలిసి మేడారం అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా గిరిజనుల ఆరాధ దైవమైన సమ్మక్క సారలమ్మ లు కొలువై ఉన్న మేడారంలో శాశ్వతంగా అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. గిరిజన సాంప్రదాయాలను గౌరవిస్తూ వాటికి భంగం కలుగకుండా పనులు పూర్తి చేస్తున్నామని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రానున్న 200 ల సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా పదికోట్ల మంది భక్తులు వచ్చినా ఇబ్బంది కలుగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి అన్నారు.
అనుకున్న ప్రకారమే పనులు
ప్రభుత్వం అనుకున్న ప్రకారమే పనులు జరుగుతున్నాయిన మంత్రి అన్నారు. జాతర ప్రారంభం కావడానికి 15 రోజుల మందే పనులు పూర్తి చేస్తామని మంత్రి అన్నారు. పనులు ఎంత వరకు అయ్యాయని సమీక్షించామని మేం అనుకున్నట్లుగా పనులు పూర్తవుతున్నాయని మంత్రి సంతృప్లి వ్యక్తం చేశారు. అధికారుల అందరూ సమన్వయంతో పనిచేస్తూ పనులు అనుకున్న టైంలో పూర్తి చేస్తున్నారనిప్రశంసించారు. ఈ నెల 25 తరువాత సీఎం రేవంత్ రెడ్డితో మేడారం పనులపై సమీక్షించనున్నట్లు మంత్రి తెలిపారు. సీఎం ఏమైనా కొత్త ప్రతిపాదనలు కాని సూచనలు కాని ఇస్తే వారి సూచనలకు అనుగుణంగా పనులు చేపడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ మీడియా సమావేశం మంత్రి పొంగులేటి తో పాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
………………………………………………………………..
