* మేడారంలోని అపరిస్కృత సమస్యలను పరిష్కరించాలి
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా మేడారం మహా జాతర పరిసరాలలో గల రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆదివాసి వివిధ సంఘాల నాయకులు మంత్రి సీతక్కకు జిల్లా కలెక్టర్ లకు వేరువేరుగా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు అనంతరం ఈసందర్భంగా విలేకరులతో మేడారం జాతర సమ్మక్క దేవత ప్రధాన పూజారి సిద్ధబోయిన సురేందర్ మాట్లాడుతూ ప్రస్తుతం జరగబోయే జాతరకు మేడారం ట్రస్ట్ బోర్డు లో గొట్టు గోత్రాలు కల్గిన ఆదివాసీలను నియమించాలి, మేడారం గ్రామపరిధిలో భూములను ప్రభుత్వం లాక్కోవద్దని,గ్రామ పంచాయతీలో గల రైతుల భూములకు రెండో పంట నష్ట పోతున్న రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి, మేడారం జాతర నిర్వహణకు కొబ్బరి బెల్లం వ్యాపారం స్థానిక నిరుద్యోగ ఆదివాసులకు కేటాయించాలి , జాతర పరిసరాలలో గల అపరిస్కృత సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ పెద్దలు కాక లింగయ్య ,ముద్దబోయిన రవి ,చర్ప చంద్రశేఖర్ ,ఆలం కృష్ణ ,ఆలం శ్రీను, పీర్ల వినోద్, మల్యాల మనోహర్, అల్లెం అశోక్, జెజ్జరి జనార్దన్ ,కాక భాస్కర్ ,వట్టం భిక్షపతి, కోట శ్రీనివాస్ ,మహిళలు సంఘాలు చేల శమంతకమణి, ఈసం స్వరూప, మోకాళ్ళ సుగుణ, సౌలం అరుణ, కాక సమ్మక్క లు తదితరులు పాల్గోన్నారు.
………………………………………
