రాష్ట్ర మంత్రి సీతక్క.
ఆకేరు న్యూస్, ములుగు: మేడారం వన దేవతల సన్నిధికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని భక్తులకు సాఫీగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం ఎస్.ఎస్ తాడ్వాయి మండలం మేడారం లోని సమ్మక్క సారలమ్మ వన దేవతలను మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్,ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ లతో కలిసి దర్శించుకున్నారు.
అనంతరం మంత్రి సీతక్క ఆలయ ప్రాంగణ అభివృద్ధి పనులను, ఫ్లోరింగ్ పనులను, క్యూ లైన్ షేడ్స్ నిర్మాణాలను పరిశీలించి త్వరిత గతిన పూర్తి చేయాలని సంబధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సెలవు దినాల లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కలిగే విధంగా చూడాలని అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి చేతుల మీదుగా గద్దెల పునః ప్రారంభం చేయడం జరుగుతుందని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. గద్దెల ప్రాంగణం విద్యుత్ కాంతుల వెలుగులతో ఆకర్షవంతగా కనిపించడం కోసం నూతన ఆధునిక విద్యుత్ దీపాలను అమర్చడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆలయ పూజారులు, గుత్తేదారులు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………..

