
* మే 1 నుంచి జూన్ 1వ తేదీ వరకు సెలవులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఈక్రమంలో అంగన్వాడీ సెంటర్ల(Anganwadi Centers)కు తక్షణమే సెలవులు ప్రకటించాలని మంత్రి సీతక్క (Minister Seethakka) ఆదేశించారు. ఈ మేరకు మే 1 నుంచి జూన్ 1వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పేరెంట్స్, అంగన్వాడీ యూనియన్ల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అధికారిక ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి. అయితే సెలవుల్లో కూడా అంగన్వాడీ లబ్దిదారులకు పౌష్టికాహారం అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అంగన్వాడీ చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు టేక్ హోం రేషన్ (Home Ration) ద్వారా గుడ్లు, సరుకుల సరఫరా చేయనున్నారు. ఇక ఈ సెలవుల కాలంలో అంగన్వాడీ టీచర్లకు ఇతర విధులు అప్పగించనున్నారు.
……………………………………………………