ఆకేరు న్యూస్, ములుగు:మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులగద్దెలను రాష్ట్ర మంత్రులు దర్శించుకున్నారు. మేడారం జాతర కోసం జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రులు సమీక్షించారు. అనంతరం మేడారం తల్లుల గద్దెలను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అమ్మవార్లను దర్శించుకున్న వారిలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, ఎస్సి,ఎస్టీ, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ లు ఉన్నారు.

……………………………………………..
