– ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే గండ్ర దంపతులు
ఆకేరున్యూస్, భూపాలపల్లి: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం భూపాలపల్లి మంజూరునగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణనాథుడు కొలువుదీరారు. ఈ ఉత్సవాల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు – పద్మ(గణపురం మండల మాజీ జెడ్పీటీసీ) దంపతులు పాల్గొని వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలు పూజారి వినయ్ శర్మ ఆధ్వర్యంలో జరిగాయి. ఉత్సవాల్లో భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడితో పాటు పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఇతర దేశాలకు ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నాయని, ప్రజలంతా ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలను ఐక్యమత్యంతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. వినాయక మండపాల నిర్వాహకులు, యూత్ పోలీసులు, ఇతర అన్ని శాఖల అధికారులు చెప్పే సలహాలు, సూచనలు తప్పక పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. వినాయక స్వామి కరుణ కటాక్షాలతో భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రతీ కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
————————