ఆకేరు న్యూస్,హైదరాబాద్:ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య స్పష్టమైన “మ్యాచ్ ఫిక్సింగ్” కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.దానం నాగేందర్‌పై పిటిషన్ వేసిన బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి స్వయంగా విచారణకు హాజరుకాకపోవడంపై కౌశిక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం విచారణకు రాకుండా, మరో తేదీ కావాలని మహేశ్వర్ రెడ్డి కోరడం వెనుక రాజకీయ కోణం ఉందని ఆయన విమర్శించారు.ఒకవైపు అనర్హత వేయాలని కోరుతూనే, మరోవైపు విచారణను సాగదీయడం చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీలు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాయని కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు.
……………………………………………………..
