* నిలువెత్తు బంగారం సమర్పణ
ఆకేరు న్యూస్,మేడారం:ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను హైదరాబాద్లోని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారత్ వెన్ ఒవేన్ దర్శించుకున్నారు.అమ్మవార్లపై భక్తితో గ్యారత్ వెన్ ఒవేన్ తన బరువుకు సమానమైన బెల్లాన్ని (బంగారం) నిలువెత్తు తులాభారంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గద్దెల వద్ద నూతనంగా నిర్మించిన కట్టడాలు, భక్తుల కోసం చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్ ఆయనకు స్వయంగా వివరించారు. గిరిజన సంస్కృతి, మేడారం జాతర విశిష్టతను అడిగి తెలుసుకున్న హై కమిషనర్, ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
…………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
