* కేటీఆర్ పై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫైర్
ఆకేరు న్యూస్, హనుమకొండ : కేటీఆర్ కు త్వరలోనే పోలీస్ పవర్ ఏంటో చూపిస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పోలీసులు అసమర్థులుగా తయారయ్యారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే తిప్పికొట్టారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊర్కునేది లేదన్నారు. మీ నాన్న ఎంత సమసర్థుడైన ముఖ్యమంత్రే రాష్ట్రప్రజలకు తెలిసిందే నని ఎద్దేవా చేశారు. బీఆర్ ఎస్ పాలనలో ఎమ్మెల్యేలను ఎంత గౌరవం లభించిందో అందరికీ తెలుసు అన్నారు. మంత్రులకు కూడా ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ లభించేది కాదని గుర్తుచేశారు. సమర్థులైన అధికారులను పక్కన బెట్టి రిటైర్ఢ్ అయిన వారిని అందలం ఎక్కించారని దుయ్యబట్టారు. సీఎంను విమర్శించినంత మాత్రాన గొప్పోడివి కాలేవు అని కేటీఆర్ కు హితవు పలికారు.
.
