* సీపీ సన్ ప్రీత్ సింగ్
ఆకేరు న్యూస్ , వరంగల్ : రక్త దానం చేయడం ద్వారా మరో ముగ్గురు వ్యక్తుల ప్రాణాలను కాపాడగలమని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని కాజీపేట డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో మడికొండలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వరంగల్ పోలీస్ సీపీ ప్రారంభించారు. ఈ శిబిరంలో పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక యువత, వ్యాపారస్తులు స్వచ్చందంగా రక్తదానం చేశారు. వీరికి సీపీ చేతుల మీదుగా సర్టిఫికెట్లు, పండ్లను అందజేశారు.అనంతరం సీపీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరులను స్మరిస్తూ రక్త దానం చేసేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చిన ప్రజలకు అభినందనలు, శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణ త్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులను స్మరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సిపి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో డిసిపి అంకిత్ కుమార్, కాజీపేట ఏసిపి ప్రశాంత్ రెడ్డి, మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్, రాష్ట్ర రెడ్ క్రాస్ పాలక సభ్యుడు ఇవి శ్రీనివాస్ తో పాటు డాక్టర్లు ఇతర పోలీస్ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
