* కొండాపూర్‌లోని ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత
* భారీగా చేరుకున్న బీఆర్ ఎస్ శ్రేణులు
* హరీశ్‌రావు సహా పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
* పోలీసులపై హరీశ్‌రావు ఆగ్రహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ కొండాపూర్(KONDAPUR)లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి(MLA PADI KAUSHIK REDDY) ఇంటి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఈరోజు ఉదయం ఆయన ఇంటికి పోలీసులు భారీ సంఖ్యలో వచ్చారని కౌశిక్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. దీంతో ఎమ్మెల్యేపై కేసు నమోదుకు నిరసనగా బీఆర్ ఎస్ శ్రేణులు భారీగా అక్కడకు చేరుకున్నారు. హరీశ్‌రావు(HARISHRAO), జగదీశ్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి(KOTHA PRABHAKAR REDDY), శంభీపూర్ రాజు(SHAMBIPUR RAJU) తదితరులు కొండాపూర్‌కు చేరుకున్నారు. కౌశిక్ నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. గేటు దూకే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇంతకంటే ఎక్కువ చేయకు.. తమాషా చేస్తుంరా అని ఓ కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తాడా.. హరీశ్‌రావు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఆందోళనల మధ్యే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనంలో ఆయనను స్టేషన్‌కు తరలిస్తున్నారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించారని నిన్న ఆయనపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
………………………………