* జగమొండిగా మార్చారు
* 18 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను
* మూల్యం చెల్లించుకోక తప్పదు
– ఎమ్మెల్సీ కవిత
ఆకేరు న్యూస్, న్యూ ఢిల్లీ: నేను తగ్గేది లేదు. జైలు జీవితం మరింత జగమొండిగా మార్చింది.. నేను కేసీఆర్ బిడ్డను తప్పు చేయను.. అంటూ కవిత తీహార్ జైలు నుంచి విడుదలయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. కవిత జైలు నుంచి విడుదలవుతుందని తెలుసుకున్న బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. జైలు ముందు బాణాసంచా కాల్చి స్వాగతం పలికారు. జైలు నుంచి విడుదలయిన కవిత ఉద్వేగంతో తన కుమారుడిని హత్తుకున్నారు. భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌లను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. జై తెలంగాణ .. జై తెలంగాణ అంటూ తన ఉపన్యాసాన్ని మొదలు పెట్టింది.. ఒక తల్లిగా పిల్లలకు దూరంగా ఐదున్నర నెలలు ఉండడం ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. మాట్లాడుతూనే కన్నీళ్ళు పెట్టుకున్నారు. 18 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. ఈ స్థితికి తెచ్చిన వారిని మాత్రం వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. సమయం వస్తుంది.. వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం.. రాజకీయ పోరాటమే కాదు, న్యాయ పోరాటం కూడా చేస్తాను. ఇంత కాలం మాకు మా కుటుంబానికి అండగా ఉన్న వారందరికీ పాదాభివందనం అన్నారు. కవిత బుధవారం హైదరాబాద్‌కు చేరుకుంటారు.. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు బీఆర్ ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు..
——————————————-
తీహార్ జైలు నుంచి విడుదలయిన తర్వాత కన్నీళ్ళ తో కవిత… ఉద్విగ్న క్షణాలు