
* కేటీఆర్ సంచలన ప్రకటన
* పోటీ చేసేందుకు కావాల్సిన సంఖ్యాబలం లేదు
* అందుకే క్యాండిడేట్‌ను పెట్టడం లేదు
* ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయొద్దని పార్టీ నేతలకు సూచన
* అసలు కౌన్సిల్‌కే వళ్లొద్దు.. ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవు
ఆకేరున్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయొద్దని తమ పార్టీ నేతలను ఆదేశించారు. పోటీ చేసేందుకు కావాల్సిన సంఖ్యాబలం లేదని అందుకే క్యాండిడేట్‌ను పెట్టడం లేదని చెప్పారు. ఎంఐఎం, బీజేపీ రెండు పార్టీలతో సంబంధం లేదని కాబట్టి ఎవరికీ ఓటు వేయవద్దని పేర్కొన్నారు. ఆ రెండు పార్టీల నేతలు ఒకటే అని అన్నారు. అసలు కౌన్సిల్‌కే వెళ్లవద్దని ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరం అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తామని అన్నారు. తెలంగాణలో బీజేపీకి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారని ఒకరు సహాయ మంత్రి, ఇంకొకరు నిస్సహాయ మంత్రి అంటూ వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించారు. రేవంత్ రెడ్డికి బీజేపీ నేతలే రక్షణ కవచాలని వ్యాఖ్యానించారు. ఎనిమిది బీజేపీ ఎంపీలు ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించరని అన్నారు. ఉదయం లేస్తే కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను విమర్శిస్తారని చెప్పారు. తెలంగాణకు బీజేపీ ఎంపీ ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు.
…………………………………………