
ఆకేరు న్యూస్, డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వంలోని డోజ్ విభాగ అధిపతి, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) తో భారత ప్రధాని నరేంద్ర మోదీ (Modi) ఫోన్ లో మాట్లాడారు. వివిధ అంశాలతో ఎలాన్ మస్క్ తో మాట్లాడినట్లు ఎక్స్ వేదికగా మోదీ వెల్లడించారు. ఈ ఏడాది వాషింగ్టన్లో మస్క్ తో అనేక అంశాలను చర్చించాన్నారు. సాంకేతిక ఆవిష్కరణల్లో సహకారంపై మస్క్ తో మాట్లాడినట్లు వెల్లడించారు. అమెరికాతో భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ తెలిపారు. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా, స్టార్ లింక్ ఇంటర్నెట్ సంస్థలు భారత్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్న వేళ వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
……………………………………..