
* ఆపరేషన్ సిందూర్‌పై వివరించిన ప్రధాని
* నేడు అఖిలపక్ష సమావేశానికి ప్రభుత్వం పిలుపు
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ’ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై విరుచుకుపడిరది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం చేపట్టిన దాడుల గురించి రాష్ట్రపతికి ప్రధాని వివరించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపు నిచ్చింది. గురువారం ఉదయం 11 గంటలకు జరగబోయే ఈ భేటీలో.. ’ఆపరేషన్ సిందూర్’ తదనంతర పరిణామాలను ఆయా పార్టీల నేతలకు ప్రభుత్వం వివరించనుంది. జాతీయ భద్రత విషయంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు- సమాచారం. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోంశాఖ మంత్రి అమిత్‌షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు తదితరులు ఈ భేటీకి హాజరుకానున్నారు. మరోవైపు భారత మెరుపుదాడులను విపక్ష నేతలు స్వాగతించారు. పాకిస్థాన్ ఉగ్ర చర్యలకు వ్యతిరేకంగా భారత్ తీసుకునే ఎలాంటి నిర్ణయాల-కై-నా తమ మద్దతు ఉంటు-ందని ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఈ మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ నిర్వహించనుంది. ప్రస్తుత పరిణామాలపై కాంగ్రెస్ నేతలు ఈ భేటీ-లో చర్చించనున్నారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సరిహద్దు రాష్టాల్ర సీఎంలు, గవర్నర్లు, డీజీపీలు, ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సవిూక్ష చేపట్టనున్నారు. ఈ భేటీ-కి జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, సిక్కిం, పశ్చిమబెంగాల్ సీఎంలు, గవర్నర్లు, అధికారులు హాజరుకానున్నారు.
……………………………………………….