
ఆకేరు న్యూస్, డెస్క్ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మారిషస్ (Mauritius) పర్యటనలో ఉన్నారు. రెండు రోజులపాటు ఆయన ఇక్కడ ఉండనున్నారు. తన పర్యటనలో భాగంగా మారిషస్ అధ్యక్షుడు (Mauritius President) ధరమ్ గోకూల్ (Dharam Gokhool)తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గోకూల్కు అపురూప కానుక ఇచ్చారు. మహాకుంభమేళా నుంచి తీసుకెళ్లిన పవిత్ర గంగాజలాన్ని (Gangajal) బహుమతిగా అందజేశారు. గంగాజలంతోపాటు ఇతర బహుమతులు కూడా ఇచ్చారు. అంతకుముందు మారిషస్ ప్రధాని డాక్టర్ నవీన్చంద్ర రామ్గూలమ్తో మోదీ భేటీ అయ్యారు. ఇదిలాఉండగా, మోదీ మారిషస్ సందర్శించడం రెండోసారి. 27 ఏళ్ల క్రితమే ఆయనకు మారిషస్ తో సంబంధం ఉంది. 1998లో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించిన మోదీ.. మారిషస్ మోకా ప్రాంతంలో అంతర్జాతీయ రామాయణ సదస్సులో పాల్గొన్నారు. నాడు బీజేపీ జాతీయ కార్యదర్శిగా అక్కడకు వెళ్లారు. నాటి ఫొటోలను ఆయన ట్విటర్ (ఎక్స్) లో షేర్ చేశారు. అందులోని మోదీ బాగున్నారని, ఓ స్టిల్ అదిరిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
………………………………………………..