* బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కారు పాలనపై ట్విటర్ వేదికగా బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Ktr) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ప్రాజెక్టులను పడావుబెట్టి, నీళ్లను ఆంధ్రాకు వదిలి పంటలను ఎండబెడుతుందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సమయానికి రైతుబంధు, 24 గంటల ఉచిత కరంటు, సాగునీళ్లు, విత్తనాలు, ఎరువులు, పంటల కొనుగోళ్లతో రైతు కంటినిండా నిద్ర, కడుపు నిండా సంతోషంగా ఉన్నాడని కేటీఆర్ గుర్తు చేశారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో రైతుభరోసా (Rythubarosa)రాదు, సాగునీళ్లు ఇవ్వరు, కరంటు ఇవ్వరు, విత్తనాలు దొరకవు, ఎరువులు ఉండవు, అన్ని గండాలు దాటుకుని పంటలు పండిస్తే కొనుగోళ్లు ఉండవు అని కేటీఆర్ పేర్కొన్నారు. అలంపూర్ నుండి ఆదిలాబాద్ (Alampur to Adilabad) వరకు అశ్వారావుపేట నుండి జహీరాబాద్ వరకు వ్యవసాయం తిరోగమనంలో ఉందన్నారు. సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నయ్.. రైతుల గుండెలు మండిపోతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ వచ్చింది.. కరువును తెచ్చింది. ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ! అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
