ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం రాత్రి ఎర్రకోట ప్రాంతంలో జరిగిన కారు పేలుడు ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఢిల్లీలోని జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. క్షతగాత్రులతో నేరుగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందిచాల్సిందిగా ఆదేశించారు.
………………………………………
