
* ఎక్స్ వేదికగా లాలూ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్ డెస్క్ : బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో బీహార్ లో రాజకీయాలు వింత వింతగా నడుస్తున్నాయి.ప్రధాని నరేంద్రమోదీ తన పుట్టిన రోజైన సెప్టెంబర్ 17వ తేదీన తల్లి దివంగత మీరాబెన్కి గయాలో పిండప్రదానం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లాలూ యాదవ్ ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పెట్టే పిండప్రదానం ఆయన తల్లి కోసం కాదని జనతాదళ్ అధ్యక్షుడు నితీష్ కుమార్ రాజకీయ జీవితానికి మోదీ పిండప్రదానం చేయనున్నారని వ్యంగ్యాస్త్రాలను లాలూ సంధించారు. లాలూ ప్రసాద్ యాదవ్ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో ఒక వీడియో షేర్ చేస్తూ, మోదీపై ‘ఓట్ చోరీ’ ఆరోపణలు చేశారు. గయాలో మోదీ 13,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, రెండు రైళ్లను జెండా ఊపి ప్రారంభించండం ఓట్ చోరీలో భాగమేనని లాలూ యాదవ్ ఆరోపించారు. మోదీ రాష్ట్రంలో ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి పొందేందుకు పలు రకాలుగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తల్లికి గయాలో పిండ ప్రదానం కూడా ఇలాంటిదేనన్నారు.’పిండ ప్రదానం’ అనే హిందూ సంప్రదాయాన్ని రాజకీయ కోణంలో ఉపయోగించడం ద్వారా మోదీ, బీహార్ లో కొత్త రాజకీయాలు చేస్తున్నారని లాలూ ప్రసాద్ యాదవ్ ఎద్దేవా చేశారు.
……………………………………….