Mohabbat Movie New Poster Release
* రాఖీ పండుగ సందర్భంగా ‘మొహబ్బత్’ బ్యూటీఫుల్ పోస్టర్ రిలీజ్
అకేరు న్యూస్, సినీ డెస్క్ :ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మొహబ్బత్’. సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు మ్యాక్ దర్శకత్వం వహిస్తున్నారు. కలాం కథ, సంభాషణలు అందిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా రాఖీ పండుగ సందర్భంగా చిత్రబృందం ఓ సోల్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసింది. హీరోహీరోయిన్లను అందంగా చూపిస్తూ.. ప్రేమ, అనుబంధాలతో కూడిన కథాంశంపై ఆసక్తిని పెంచేలా ఈ పోస్టర్ ఉంది.
ఎమోషనల్ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా ‘మొహబ్బత్’ తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.
సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తుండగా.. వైఎస్ కృష్ణ ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు. అజయ్ ఘోష్, సాత్విక్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
