* గాలిస్తున్న పోలీసులు
ఆకేరున్యూస్ డెస్క్: మంచు మోహన్ బాబు పరారీలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. జర్నలిస్టులపై దాడి ఘటనలో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే… కాగా ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, తదుపరి దర్యాప్తు చేపట్టకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్ట్.. అభ్యర్థనను కొట్టివేసింది. మోహన్‌బాబు కోసం 5 చోట్ల పోలీసులు గాలించగా ఆయన ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు.
………………………………