ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : మలయాళంలోనే కాకుండా తెలుగులోనూ గుర్తింపు పొందిన స్టార్ మోహన్‌లాల్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అతడి తల్లి శాంతకుమారి (90) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంగా ఉన్నారు. లక్కలోని తన ఇంటికి సమీపంలోని అమృత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం కొచ్చిలోని ఎలమక్కరలోని మోహన్ లాల్ ఇంట్లో తుదిశ్వాస విడిచారు. శాంతకుమారి భర్త మాజీ లీగల్ సెక్రటరీ, దివంగత విశ్వనాథన్ నాయర్. ఆమె అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న మోహన్ లాల్ తల్లి మరణవార్త తెలియగానే మోహన్ లాల్ ఎర్నాకుళంలోని తన ఇంటికి చేరుకున్నారు.
………………………………………..

